WELCOME

WELCOME

ఎన్టీఆర్‌ ఫాన్స్‌కి పండగ పక్కా

jr.ntr,samantha,sruthi hassan,harish shankar,thamman,dilraju,ramayya vasthavayya movie,details,info,images,pics,stills,posters,songs,review
ntr samntha ramyya vathavayya pics

ఎన్టీఆర్‌ 'బాద్‌షా' చిత్రంలో అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మంచి డాన్సులు వేసి
వారికి ఒకింత సంతృప్తిని కలిగించాడు. అయితే ఎన్టీఆర్‌ ఆ చిత్రంలో తన బెస్ట్‌ డాన్స్‌లు అయితే
వేయలేదు. సింహాద్రి, యమదొంగ టైమ్‌లో నంబర్‌వన్‌ డాన్సర్‌గా కితాబులు అందుకున్న ఎన్టీఆర్‌
మళ్లీ ఆ స్థాయిలో ఇంతవరకు నర్తించలేదు.

'రామయ్యా వస్తావయ్యా'లో ఫాన్స్‌కి ఆ లోటు తీరిపోతుందని బలమైన టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో
 మూడు పాటల్లో ఎన్టీఆర్‌ అదిరిపోయే డాన్సులు వేశాడట. అతని ఇంట్రడక్షన్‌ సాంగ్‌ అయిన
'పండగ చేస్కో'లో ఎన్టీఆర్‌ డాన్స్‌ మూమెంట్స్‌కి ఫాన్స్‌ ఉర్రూతలూగిపోతారట. 'ఓ లైలా' సాంగ్‌లో కూడా
 ఎన్టీఆర్‌ డాన్సులు చాలా బాగున్నాయని టాక్‌. ఇక ఎంతో కాలంగా ఎన్టీఆర్‌ మార్కు మాస్‌ హీరోయిజం
చూడక వెలితిగా ఫీల్‌ అవుతున్న అభిమానులు ఈ చిత్రంలో పండగ చేసుకునే సీన్లు చాలా ఉన్నాయట.
సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్‌ సీన్స్‌ మళ్లీ సింహాద్రి రోజులు గుర్తు చేస్తాయని అంటున్నారు. ఈ చిత్రంలోని
 యాక్షన్‌ పార్ట్‌ వల్లే దీనికి ఏ సర్టిఫికెట్‌ ఇచ్చారని దిల్‌ రాజు చెప్పాడు. దీనిని బట్టి యాక్షన్‌ ఏ లెవల్లో
ఉంటుందనేది ఊహించుకోవచ్చు

ShareThis

Related Posts Plugin for WordPress, Blogger...
Powered By BSMOVIE · Designed By SATISH