టాలీవుడ్‌లో షేర్‌ఖాన్‌గా పేరుతెచ్చుకున్న రియల్ స్టార్ శ్రీహరి బుధవారం హఠాన్మరణం చెందారు. గత కొద్దికాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆయన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం కన్నుమూశారు శ్రీహరి భార్య ప్రముఖ సినీ డ్యాన్సర్ డిస్కోశాంతి. వీరికి ఇద్దరు సంతానం. శ్రీహరికి 49 సంవత్సరాలు. 1964 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. ఇటీవల మగధీర, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, భద్రాచలం, తుఫాన్ చిత్రాల్లో నటన ఆయనకు మంచి పేరు తెచ్చాయి. పృథ్వీపుత్రుడు అనే చిత్రంలో టాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసిన శ్రీహరి తన కెరీర్‌లో మొత్తం 97 చిత్రాల్లో నటించగా, 28 సినిమాల్లో హీరోగా కనిపించారు. స్టంట్ ఫైటర్‌గా, విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలో రాణించారు. శ్రీహరి చిత్రం చిత్రం రామ్ చరణ్ హీరోగా నటించిన తుఫాన్. |
tollywood latest movies ,actors,reviews,trailers,serials,shortfilms,videos,news at one place