'అత్తారింటికి దారేది' సినిమా ఇంటా బయటా సాధిస్తున్న విజయాలతో అందరి దృష్టీ ఇప్పుడు
పవన్ కల్యాణ్‌పై పడింది. ఈ సినిమా కేవలం పది రోజుల్లో మన రాష్ట్రంలో సుమారు 40 కోట్లు వసూలు
చేయడం ... ఓవర్సీస్‌లో మరో 16 కోట్లు కలెక్ట్ చేసి సునామీ సృష్టించాడు పవన్. అయితే పవన్ సునామీ
ఇప్పుడు బాలీవుడ్ కు తాకింది. పవన్ బాక్సాఫీసును కొల్లగొడుతున్న తీరును చూసి బాలీవుడ్‌ని విస్మయానికి గురిచేస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ స్టామినా గురించి అక్కడ ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్‌తో హిందీ, తెలుగు ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తే, అద్భుతమైన వసూళ్లను రాబట్టవచ్చని
కొందరు బాలీవుడ్ నిర్మాతలు ఆ దిశగా ఆలోచిస్తున్నారట. ఈ విషయంలో కొన్ని ప్రపోజల్స్‌తో పవన్‌ని సంప్రదించడానికి అప్పుడే కొందరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే, పవన్ అంత ఈజీగా వీరికి దొరుకుతాడా? బాలీవుడ్ సినిమా చేస్తాడా? అన్నది సందేహాస్పదమే. ఎందుకంటే, పవన్‌ని కన్విన్స్ చేయడం
చాలా కష్టం. డబ్బు కోసమో... పేరు కోసమో .. ఆయన చేతులు చాచడన్న విషయం అందరికీ తెలిసిందే!