రికార్డులు సృష్టించడం ఎన్టీఆర్‌కి కొత్తేం కాదు.. అమ్మతోడు – రికార్డులన్నీ నావే – అంటుంటాడు ఎన్టీఆర్. '
అదీ నిజమే. ఇప్పుడు రామయ్యా వస్తావయ్యా కూడా రికార్డుల సాధన దిశగా తొలి అడుగు వేసింది. శుక్రవారం రామయ్యా వస్తావయ్యా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేటర్లలో
విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే ఇదే రికార్డ్. ఓవర్సీస్‌లో కూడా
ఈ సినిమా ఎక్కువ ప్రింట్లతో సందడి చేయనుంది. ఎన్టీఆర్‌కి ఓవర్సీస్ మార్కెట్ కాస్త తక్కువనే చెప్పాలి.
మహేష్ బాబు, పవన్ కల్యాణ్‌లకు అక్కడ తిరుగులేదు. ఇప్పుడు వీరిద్దరికీ పోటీగా అక్కడ వసూళ్లు కుమ్ముకొందాం అని చూస్తున్నాడు ఎన్టీఆర్. మరి రామయ్యా వసూళ్లు తెస్తాడో లేడో చూడాలి.