బలుపుతో బలుపు బాగా పెరిగింది
బలుపు సినిమాకు చాలా పెద్ద టీమ్ పనిచేసిందనే చెప్పాలి. ఒకో శాఖకు ఇద్దరు ముగ్గురు టెక్నీషియన్లు పనిచేశారు. అయితే సినిమా తొలిరేజే హిట్ టాక్ సంపాదించుకోవడంతో వీళ్లలో చాలామంది ఆకాశంలో తేలిపోతున్నారు. పోనివ్‌లే సినిమా హిట్టయ్యింది కాబట్టి వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా పర్లేదు. అయితే ఈ బలుపు వాపు కాదు అంటూ కొంతమంది మాత్రం చాలా రెచ్చిపోతున్నారు.
ఈ సినిమా టీమ్‌లో పనిచేసిన రచయిత వద్దకు ఒక ప్రొడ్యూసర్ వచ్చి, మంచి కథలు ఉంటే చెప్పండి అన్నారట. అప్పుడు సదరు రచయిత, అసలు నీకు నేను కథలు తయారుచేసే బడ్జెట్‌లో సినిమా తీసే రేంజ్ ఉందా అన్నాడట. ఇక్కడే మన ప్రొడ్యూసర్‌కు కాలిపోయి, అసలు మీకు కథలు రాయడం రాదుకదా, కేవలం ప్రాజెక్టులు సెట్ చెయ్యడమే కదా మీ పని, ఎందుకింత ఓవర్ చేస్తున్నారు అంటూ సుతారంగా సెటైర్ వేసాడని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే బలుపు సినిమాలో నాలుగైదు సీన్లు తప్ప నిజంగానే కథ ఏమీ లేదు. మరి రియాల్టీ కళ్ళకు కట్టినట్లు కన్పిస్తుంటే, మనోళ్ళెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో తెలియదు.