ఒరిస్సాలో జరిగిన యదార్ధ రేప్ సంఘటన ఆధారంగా తీస్తున్న ఈచిత్రంలో ఛార్మి జర్నలిస్ట్ పాత్ర పోషిస్తుంది.ఈసినిమాలో 20 నిమిషాల నిడివి గల ఒక పవర్ ఫుల్ పాత్ర కోసం తమ్మారెడ్డి వెతుకులాట మొదలుపెట్టాడు.మొదట హీరో గోపీచంద్ ను తీసుకొంధామనుకున్న తమ్మారెడ్డి సడెన్ గా నిర్ణయం మార్చుకుని పవర్ స్టార్ అయితే ఈపాత్రకు కరెక్ట్ గా సూట్ అవుతాడని భావిస్తున్నాడట పవన్ తో గబ్బర్ సింగ్ -2 చిత్రాన్ని నిర్మిస్తున్న పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ తమ్మారెడ్డి కి బాగా తెలియటంతో అటువైపు నుంచి నరుకొచ్చే పనిలో పడ్డాడు ఈ వెటరన్ డైరెక్టర్.అంతకముందు చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమా ల్లో గెస్ట్ రోల్ చేశాడు పవన్ మరి ఛార్మి నటిస్తున్న సినిమాకు పవన్ లాంటి పెద్ద హీరో గెస్ట్ రోల్ చేయటం అనుమానమే …… |