బలుపు సినిమా బాలయ్యకు కోపం తెప్పించిందని అంటున్నారు. ఓ సన్నివేశంలో బాలయ్యను ఇమిటేట్ చేస్తూ రవితేజ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను అలరించాయి కానీ, బాలయ్యకు మాత్రం మంట పుట్టించాయట. జోకులెయ్యడానికి నేనే దొరికానా అంటూ ఫైరయ్యాడని కొందరు అంటున్నారు. అతడి కోపం అతడి ఫ్యాన్స్ కి బాధ కలిగించిందట. దాంతో వాళ్లు రభస చేయడానికి రెడీ అయ్యారట. అదృష్టం బాగుండి ఈ విషయం రవితేజకు ముందే తెలిసిపోయింది. దాంతో డైరెక్టర్ ను పిలిచి పరువు కాపాడుకోవడం బెటరని చెప్పాడని సమాచారం. కంగారుపడిన గోపీచంద్ మలినేని వెంటనే మైకు పట్టాడు. నేను బాలయ్యకు వీరాభిమానిని, ఆయన మీద జోకులేసేంత ధైర్యం చేయను, అసలు అలాంటి ఆలోచనే లేదు అంటూ వివరణలు ఇచ్చేశాడు. దాంతో బాలయ్య కాస్త కూలయ్యాడని అంటున్నారు.
అసలే గతంలో ఓ హీరోయిన్ విషయంలో రవితేజ, బాలయ్యలు గొడవ పడ్డారనే పుకారు ఉంది. ఆ సయమంలో బాలయ్య రవితేజ చెంప ఛెళ్లుమనిపించాడని కూడా కొందరు అంటారు. ఇప్పుడు మళ్లీ బాలయ్యతో సున్నం పెట్టుకోవడానికి రవితేజ కచ్చితంగా భయపడే ఉంటాడు. అందుకే గొడవను ఆపే పనిని గోపీచంద్ కి అప్పగించినట్టున్నాడు. అయినా సినిమా తీసుకోండయ్యా బాబూ అంటే, ఇలా ఒకళ్ల మీద ఒకళ్లు జోకులేసుకుని అవమానించుకోవడం ఏమిటో. వీళ్లను చూసి వీళ్లే నవ్వేసుకుంటే, వీళ్లందరినీ చూసి జనం నవ్వుకుంటారన్న ఆలోచనే రావడం లేదా వీళ్లకి!