షూటింగ్, సెట్టు, యాక్షన్, కట్... అంటూ బిజీబిజీగా గడిపే దర్శకధీరుడు రాజమౌళి వంటింట్లోకి దూరాడు.
భార్య రమకి సాయం చేశాడు. ఇంతకీ రాజమౌళి చేసిన వంటేమిటో తెలుసా? పులిహోర. స్వయంగా తన చేత్తో పులిహోర కలిపాడు. వినాయక చవితిరోజున కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా గడిపాడు.
``టమాటో పులిహోరా చేయడంలో రమాకి తిరుగులేదు. అందులో ఆమె మాస్టర్. నేను కేవలం పులిహోరాని కలిపానంతే`` అని ట్వీట్ చేశాడు రాజమౌళి. ఎంత దర్శకుడైనా రాజమౌళి మాత్రం ఎప్పుడూ అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాడు.