ఇష్క్, గుండె జారి గల్లంతయిందే... చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించాడు అనూప్ రూబెన్స్. తనదైన
బాణీలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఆ తర్వాత పలు భారీ చిత్రాలకు పని చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. అందులో ఒకటి `రభస`. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.
అనూప్ రూబెన్స్ రెండు పాటలు కూడా సిద్ధం చేశాడు. అయితే ఏమైందో తెలియదు కానీ... ఉన్నట్టుండి అనూప్ స్థానంలోకి తమన్ వచ్చి చేరాడు. మిగిలిన స్వరాలతో పాటు, నేపథ్య సంగీతం సమకూర్చే బాధ్యతలను తమన్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ కి అనూప్ బాణీలు నచ్చకపోవడంతోనే తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.