ఖాన్ త్రయంతో కలిసి నటించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది
ఇలియానా. వీలైనన్ని అవకాశాలు సొంతం చేసుకోవాలని చూస్తోంది. ముంబైలోనే మకాం
వేసి ప్రముఖ దర్శకులు, కథానాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. `బర్ఫీ`తో
మంచి గుర్తింపును తెచ్చుకున్నా అమ్మడికి అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే.
అయితే ఇటీవల రాకరాక వచ్చిన ఆ అవకాశాలను కూడా ఇతర కథానాయికలు
తన్నుకుపోతున్నారు. అది అమ్మడికి ఏమాత్రం మింగుడు పడడం లేదు. ఇటీవల అక్షయ్
కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఓ చిత్రంలో ఇలియానాని కథానాయికగా
ఎంచుకున్నారు. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్ళడమే తరువాయి అనుకున్నారు. కానీ
ఉన్నట్టుండి అందులోని ఇలియానాని తీసి అమలాపాల్ కి అవకాశాన్ని కట్టబెట్టారు.
అమలాపాల్ ఎలా కన్నేసిందో కానీ ఏకంగా ఇలియానా అవకాశానికి ఎసరు పెట్టింది.
దీంతో ఇల్లూ అగ్గిమీద గుగ్గిలమవుతోందట.