WELCOME

WELCOME

శంకర్ ఏం కథ చెప్పాడో?!

శంకర్ ఏం కథ చెప్పాడో?!

తమిళ శంకర్ దర్శకత్వంలో `భారతీయుడు` సినిమా చేశారు కమల్ హాసన్. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు తెలుగు శంకర్ దర్శకత్వంలోనూ ఓ భారీ చిత్రం చేయడానికి తన అంగీకారం తెలిపాడు. `విశ్వరూపం 2` తర్వాత... శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది.

దాసరి నారాయణ రావు సహకారంతో యన్.శంకర్... కమలహాసన్ కి కథను వినిపించాడట. శంకర్ కథను విన్న కమల్ సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ సినిమాని మనం చేస్తున్నాం అని చెప్పాడట. అయితే కథలో మాత్రం కొన్ని మార్పులు చెయ్యాల్సిందే అన్నాడట. ఇంతకీ కమల్ కి శంకర్ ఎలాంటి కథ చెప్పుంటాడు అన్నదాని గురించి చర్చ సాగుతోంది.   రూ 60 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తారట. ఓ ఉద్యమకారుడి జీవితం ఆధారంగానే ఈ సినిమా తెరకేక్కబోతోందని ప్రచారం సాగుతోంది. అసలు విషయాలు  మరికొన్ని రోజుల్లోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

ShareThis

Related Posts Plugin for WordPress, Blogger...
Powered By BSMOVIE · Designed By SATISH