పాల బుగ్గల హన్సిక ఫుల్ ఫామ్ లో ఉంది. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా వరసబెట్టి అవకాశాలు
అందుకుంటోంది. తాజాగా తెలుగులో నితిన్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇప్పటికే నాగచైతన్య, మంచు
విష్ణుతో కలిసి రెండు చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలోనూ నాలుగైదు చిత్రాలతో బిజీగా గడుపుతోంది.
ఇప్పుడు అక్కడ సుందర్. సి దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేసేందుకు సిద్ధమైంది. ఈ దూకుడు చూస్తుంటే హన్సిక ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. ఒప్పుకున్నా సినిమాలు పూర్తి కావాలంటే ఇంకా ఏడాదైనా పడుతుంది. బరువు తగ్గి హన్సిక తన అందాలకు మరింత పదును పెట్టింది హన్సిక. చూస్తుంటే ఇక ఇప్పట్లో ఫామ్ కోల్పోయేలా కనిపించడం లేదన్నమాట.