తడాఖా సినిమాతో మాస్ కథానాయకుల జాబితాలోకి చేరాడు నాగచైతన్య. త్వరలో రానున్న
`ఆటోనగర్ సూర్య`తో ఆ వర్గం ప్రేక్షకులకు మరింతగా చేరువవుతానని చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన ఎంచుకుంటున్న కథలు కూడా అదే తరహాలోనే ఉంటున్నాయి. ఇటీవల పరశురామ్ చెప్పిన ఓ కథకు
నాగచైతన్య పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో ఓ పక్కా మాస్ మసాలా సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. యువత, ఆంజనేయులు, సోలో, సారొచ్చారు తదితర చిత్రాలను తీసిన
దర్శకుడు పరశురామ్.
ప్రముఖ దర్శకుడు పూరికి వరసకు తమ్ముడైన పరశురామ్ మంచి ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆయన రాసుకునే సంభాషణలు పదునుగా ఉంటాయి. ఇటీవల అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నదని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఆయన తీయబోయేది మాత్రం నాగచైతన్యతోనే అని ఖరారైంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకం పై అశ్వినీదత్ నిర్మించబోతున్నారని తెలుస్తోంది.