ఛార్మింగ్ గర్ల్ ఛార్మి ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్ళికి తొందరేముంది? పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కెరీర్ ఇప్పుడు మాత్రమే వుంటుంది. నా కెరీర్ ఇప్పుడు బాగుంది. ఇప్పుడప్పుడే పెళ్ళి గురించి ఆలోచించను. 40 సంవత్సరాలకైనా పెళ్ళి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే పాత్రలు అప్పుడు చేయలేను కదా! అంటోంది. ఇప్పుడు ఈవిడ గారి కెరీర్ అంత ఏం బాగుందో, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారని ఈ భామకు తెలియదేమో మరి? అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు.