టాలీవుడ్ లో హీరోలందరూ యూట్యూబ్ బాట పట్టారు .ఇన్నాళ్ళూ 100 రోజులు ఆడిన థియేటర్ ల లెక్కలను ఉపయోగించి సినిమా ఫలితాన్ని ,హీరో క్రేజ్ ని అంచనా వేసేవారు .ఇప్పుడు ట్రెండ్ మారింది . హీరోల క్రేజ్ ని యూ ట్యూబ్ లో కొలుస్తున్న సంగతి తెలిసిందే. హీరోల నటించిన చిత్రాల పాటలు లేదా టీజర్ యూ ట్యూబ్ లో విడుదల చేసి అవి ఎంత మంది చూసారో అన్నదాన్ని బట్టి హీరో స్టామినా ని లెక్క కడుతున్నారు . ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ కు వచ్చింది. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘రామయ్యా వస్తావయ్యా’చిత్రంలోని జాబిల్లి నువ్వే చెప్పమ్మా పాట ని విడుదల చేసారు. ఆ పాట ఇప్పుడు యూ ట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.అంతకుముందు ఎన్నడూ లేని విదంగా ఈ టీసర్ కి రెండు రోజుల్లో 637,772 వ్యూస్ వచ్చాయి.
అంతకు ముందు మహేశ్ నటించిన వన్ సినిమా టీసర్ ,పవన్ కల్యాణ్ నటించిన అత్తరింటికి దారేది లోని కాటమ్ రాయుడ పాటకు రెండు రోజుల్లో వచ్చిన వ్యూస్ కంటే ఇవి చాలా ఎక్కువ .ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అహిమానులు పండగ చేసుకుంటున్నారు .తమ హీరో అందరి రికార్డు లు బ్రేక్ చేశాడని సినిమా విడుదల అయ్యాక ఇంకేన్నో రికార్డు లు బ్రేక్ అవటానికి సిద్దంగా ఉన్నాయని చెప్తున్నారు .
ఈ సినిమా గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ” ‘బృందావనం’ ఎన్టీఆర్‌కి ఎంత మంచి పేరు తెచ్చిందో…. అంతకు పదింతలు పేరు తెచ్చే సినిమా ఇది. హరీష్‌శంకర్ అద్భుతం అనిపించే స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఎన్టీఆర్ పాత్రను ఆయన మలిచిన తీరు చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమాతో హరీష్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు.”అని చెప్పారు.
ఈ నెల 8 న ఈ సినిమా పాటలు మార్కెట్ లోకి విడుదల కానున్నాయి .సెప్టెంబర్ 27 న సినిమా ను రిలీస్ చేయటానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు మొదలు పెట్టారు